హైదరాబాద్ గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై ప్రమాదం – zypuc

Share this:


ఫ్లైఓవర్ పై నుంచి కింద పడ్డ కారు…కారులో ముగ్గురు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు. ఒక మహిళ మృతి, ఎనిమిది మందికి గాయాలు హాస్పిటల్ కి తరలింపు.

పల్టీలు కొడుతూ కింద వెళ్తున్న మరో కారుపై పడ్డ కారు
ఆటో కోసం ఎదురుచూస్తున్న మహిళ  అక్కడికక్కడే మృతి
8 మందికి తీవ్ర గాయాలు.
ఓవర్ స్పీడ్ వల్లే ప్రమాదం, భారీగా ట్రాఫిక్ జామ్
నగరంలోని బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ పై ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్  పై నుంచి ఓ కారు (TS09 EW 5659)అదుపు తప్పి కింద వెళుతున్న మరో కారు మీద పడింది.  అక్కడే ఆటో కోసం ఎదురు చూస్తున్న కొందరు వ్యక్తులపై  పడడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించగా మరో 8 మంది తీవ్ర గాయాలయ్యాయి . ఓవర్ స్పీడ్ తో  వెళుతున్న కారు అదుపు తప్పి ఫ్లై ఓవర్ పై నుంచి  పల్టీలు కొడుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో కారు తునాతునకలైంది. దీంతో ఫ్లై ఓవర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.READ  EVALU RAMMANNARU KODUKA MP3 SONG FREE DOWNLOAD - CHARAN ARJUN

Leave a Comment